Fri Dec 20 2024 17:15:02 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఈ కలెక్టర్ ఎవరో మీకు తెలుసా?
పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్ గా చదలవాడ నాగరాణి బాధ్యతలు తీసుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నూతన కలెక్టర్ గా చదలవాడ నాగరాణి బాధ్యతలు తీసుకున్నారు.ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే ఆమెను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించారు. చదలవాడ నాగరాణి కన్నా ఆమె భర్త ఐపీఎస్ చదలవాడ ఉమేష్ చంద్ర అందరికీ సుపరిచితం. హైదారాబాద్ లో ఎస్సార్ నగర్ సెంటర్లో పట్టపగలు మావోయిస్టులు హత్య చేశారు.
మావోయిస్టుల కాల్పుల్లో...
డ్యూటీ నిమిత్తం వెళ్తుంటే ఉమేష్ చంద్రను నక్సలైట్లు ప్రతీకారంతో కాల్చి చంపారు. అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. ఆతర్వాత ఉమేష్ చంద్ర భార్య నాగరాణికి డిప్యూటీ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలిచ్చారు. బీబీఎం చదివిన నాగరాణి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, ఇప్పుడు పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్ గా వచ్చారు. ఒక కుమారుడు ఉన్నారు. నాగరాణి పుట్టినిల్లు తూర్పుగోదావరి జిల్లా కావడం విశేషం. పొరుగు జిల్లాకు ఆమె కలెక్టర్ గా బాధ్యతలను స్వీకరించారు.
Next Story