Sun Mar 16 2025 12:14:11 GMT+0000 (Coordinated Universal Time)
మండలి నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
శాసనమండలి నుంచి ఎనిమిది మంది టీడీపీ సభ్యులను ఛైర్మన్ సస్పెండ్ చేశారు

శాసనమండలి నుంచి ఎనిమిది మంది టీడీపీ సభ్యులను ఛైర్మన్ సస్పెండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు తాళిబొట్లతో నిరసనలు తెలియజేయడం, నినాదాలు చేస్తుండటంతో ఛైర్మన్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. తొలుత సభను కొంచెంసేపు వాయిదా వేసిన ఛైర్మన్ సభ ప్రారంభమయిన వెంటనే తిరిగి టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుండటం, సభా కార్యక్రమాలకు అడ్డుతగలడంతో సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయింది....
టీడీపీ సభ్యులు కేఈ ప్రభాకర్, దీపక్ రెడ్డి, అశోక్ బాబు, మంతెన సత్యనారాయణరాజు, బత్తుల అర్జునుడు, రామారావు, తిరుమల రాయుడులను ఛైర్మన్ సస్పెండ్ చేశారు. కల్తీ మద్యం కారణంగానే మహిళల తాళిబొట్లు రాష్ట్రంలో తెగిపోతున్నాయని, అందుకు జగన్ రెడ్డి కారణమని వారు నినాదాలు చేశారు.
Next Story