Mon Nov 25 2024 12:16:22 GMT+0000 (Coordinated Universal Time)
మార్చి 3న ఛలో ఆంధ్రా యూనివర్శిటీ
ఆంధ్రా యూనివర్శిటీ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం..
విశాఖపట్నం : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవీ హర్షకుమార్ ఆంధ్రా యూనివర్శిటీ పరిరక్షణ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మార్చి 3వ తేదీన ఛలో ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హర్షకుమార్.. ఆంధ్రా యూనివర్శిటీ పరిరక్షణ కోసం ఉద్యమం చేపట్టినట్లు తెలిపారు. యూనివర్శిటీ స్వయం ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు.
Also Read : ఈతకువెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి
కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసిన వారికే వర్శిటీలో పెద్దపీట వేస్తున్నారని హర్షకుమార్ ఆరోపించారు. రిటైర్ అయిన ఉద్యోగిని.. తిరిగి రిజిస్ట్రార్ గా నియమించిన చరిత్ర ఏ యూనివర్శిటీలోనూ లేదన్న హర్షకుమార్.. యూనివర్శిటీలో జరుగుతోన్న అక్రమాలపై ప్రశ్నిస్తామన్నారు. కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తున్నాయని మండిపడ్డారు.
Next Story