Sun Dec 14 2025 18:06:56 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో టెన్షన్ టెన్షన్
చలో విజయవాడ కార్యక్రమం టెన్షన్ రేపుతుంది. దీంతో విజయవాడ చేరుకుంటున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

చలో విజయవాడ కార్యక్రమం విజయవాడలో టెన్షన్ రేపుతుంది. దీంతో విజయవాడ చేరుకుంటున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. కడప పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న మృతిపై సమగ్ర విచారణ జరిపించాలిలని సీపీఐ డిమాండ్ చేస్తూ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
మూడు కార్యక్రమాలు...
మరోవైపు ఈరోజు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కాసేపట్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నుంచి చలో విజయవాడ కార్యక్రమం జరగనుంది. అలాగే ఈరోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు సెల్ ఫోన్ డౌన్ కార్యక్రమానికి పిలుపు నిచ్చారు. తమ డిమాండ్ల సాధనకు మలిదశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. అఖిలపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్లు చేస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. పోలీసులు మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

