Mon Dec 23 2024 18:00:40 GMT+0000 (Coordinated Universal Time)
ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే : చంద్రబాబు
నారాయణ అరెస్ట్ పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్షసాధింపు..
అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు నేడు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి, ఏపీకి తరలించారు. ఏపీ 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో నారాయణను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నారాయణ అరెస్ట్ ను టిడిపి నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులు తప్పుచేస్తే.. చైర్మన్ ను ఎలా అరెస్ట్ చేస్తారంటూ అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు.
తాజాగా.. నారాయణ అరెస్ట్ పై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కక్షసాధింపు చర్యేనంటూ.. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైతే.. ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే నారాయణను అరెస్ట్ చేయించిందని ధ్వజమెత్తారు. ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడంకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్య కాకుంటే.. మరేంటి ? అని ప్రశ్నంచారు.
Next Story