Sat Jan 11 2025 06:33:12 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ వాయిదా
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను వాయిదా వేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణను వాయిదా వేసింది. ఈ నెల 22వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కారణంగా ఈ కేసును వాయిదా వేయాలని సీఐడీ కోరడంతో ఈ నెల 22వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో చంద్రబాబు ఏ1 నిందితుడిగా ఉన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో...
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ నేటితో ముగిసింది. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రెండు వర్గాలు తమ వాదనలను వినిపించాయి. అయితే సీఐడీ మాత్రం ఎటూ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు కాబట్టి ఈ కేసు విచారణ వాయిదా వేయాలని కోరగా అందుకు హైకోర్టు అంగీకరించింది.
Next Story