Sun Mar 16 2025 08:54:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బాబు, పవన్ ఉమ్మడి ప్రచారం
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ లు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ప్రచారాన్ని వేగం పెంచారు. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ లు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఇక ఎన్నికలకు పందొమ్మిది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇద్దరు కలసి ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల ఓట్ల బదిలీ సులువుగా మారుతుందని భావిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో...
ఈరోజు, రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించనున్నారు. నేడు విజయనగరం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. నెల్లిమర్ల, విజయనగరంలలో జరిగే సభల్లో వారు ప్రసంగంచనున్నారు. రేపు రాజంపేట, రైల్వేకోడూరులో కలసి ప్రచారం నిర్వహించనున్నారు.
Next Story