Mon Dec 23 2024 04:31:48 GMT+0000 (Coordinated Universal Time)
మహానాడుకు కమిటీల నియామకం
తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు 16 కమిటీలను చంద్రబాబు నియమించారు
తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు 16 కమిటీలను చంద్రబాబు నియమించారు. పలువురు సీనియర్ నాయకులను కమిటీల్లో సభ్యులుగా నియమించారు. రాజమహేంద్రవరం సమీపంలోని వేమగిరి ఉన్న స్థలంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. మహానాడు వేదిక వద్ద నేడు భూమిపూజ నిర్వహించి, పనులు ప్రారంభించనున్నారు.
16 కమిటీలు...
ఆహ్వాన కమిటీలో తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ సభ్యులుగా ఉన్నారు. తీర్మానాల కమిటీలో యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్.ఏ.షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల్ని నియమించారు. అన్ని కమిటీల్లో కలిపి మొత్తం 200 మంది సభ్యులను చంద్రబాబు నియమించారు.
Next Story