Mon Dec 23 2024 07:49:56 GMT+0000 (Coordinated Universal Time)
పులివెందుల నేతకు పార్టీ కీలక పదవి
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా పులివెందులకు చెందిన నేతను చంద్రబాబు నియమించారు
తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా పులివెందులకు చెందిన నేతను చంద్రబాబు నియమించారు. పులివెందుల నియోజకవర్గానికి చెందిన పేర్ల పార్థసారధిరెడ్డిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినట్లు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. చంద్రబాబు సూచన మేరకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
మార్కెట్ యార్డు ఛైర్మన్...
పులివెందులకు చెందిన పేర్ల పార్థసారధిరెడ్డి టీడీపీ నేతగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయనను టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించడంపట్ల ఆయన సొంత గ్రామమైన వేములలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. పులివెందులలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్ల పార్ధసారధి రెడ్డి చెప్పారు.
Next Story