Mon Dec 15 2025 00:18:49 GMT+0000 (Coordinated Universal Time)
మదనపల్లె అగ్నప్రమాద ఘటనపై చంద్రబాబు సీరియస్
మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ, సీఐడీ చీఫ్ లు వెంటనే ఘటన స్థలికి హెలికాప్టర్ లో చేరుకోవాలని ఆదేశించారు. దీనిపై అత్యవసర విచారణకు చంద్రబాబు ఆదేశించారు. ఈ అగ్నిప్రమాదంలో కొన్ని అసైన్మెంట్ ల్యాండ్ కు సంబంధించిన ఫైళ్లు దగ్దమయినట్లు గుర్తించారు.
కుట్రకోణమా?
అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆయన ఆరా తీశారు. యాధృఛ్చకంగా జరిగిందా? లేక కుట్ర కోణం దాగి ఉందా? అన్న దానిపై విచారణ జరపాలని ఆదేశించారు. నూతన సబ్ కలెక్టర్ జాయిన్ అవ్వకముందే ఈ అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తుంది. కాకపోతే కార్యాలయానికి చెందిన ఉద్యోగి నిన్న రాత్రి పదకొండు గంటల సమయంలో కార్యాలయంలోనే ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు సాయంత్రానికి కాని తెలియరావు.
Next Story

