Tue Nov 19 2024 10:37:06 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రిగారి భార్య తీరుకు చంద్రబాబు అసంతృప్తి... సీరియస్
మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి భార్య హరిత రెడ్డి రాయచోటి పోలీసులతో వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు
రవాణాశాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సతీమణి హరిత రెడ్డి రాయచోటి పోలీసులతో వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న రాయచోటిలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సతీమణి ఒక కార్యాక్రమానికి వెళ్లాల్సి ఉండగా పోలీసు ఎస్కార్ తనకు రాలైదని, పైలట్ వాహనం పెట్టలేదని వారిపై ఆగ్రహించారు. మీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అంటూ ప్రశ్నించారు. వైసీపీ నేతలకు ఊడిగం చేస్తున్నారా? అంటూ నిలదీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంత్రి భార్య కార్యక్రమాలకు ఎస్కార్ట్ పంపడమేంటని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా...
ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారడంతో ఈ విషయం చంద్రబాబు దృష్టిికి కూడా వచ్చింది. దీంతో ఆయన తన అసంతృప్తిని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి వ్యక్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల పట్ల గౌరవంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా చేయవద్దని, అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో రామ్ ప్రసాద్ రెడ్డి తన సతీమణి ప్రవర్తనప విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరినట్లు చంద్రబాబు గట్టిగానే రామ్‌ప్రసాద్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
Next Story