Sun Dec 22 2024 14:59:06 GMT+0000 (Coordinated Universal Time)
అయ్యన్న అరెస్ట్ చేస్తారా? అలా అయితే ఇలా చేయండి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అయ్యన్న అరెస్ట్ ను ఆయన ఖండించారు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ పై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అయ్యన్న అరెస్ట్ ను ఆయన ఖండించారు. సీనియర్ నేతలతో చంద్రబాబు హుటాహుటిన సమావేశమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరకున్న చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలతో టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. అందుబాటులో ఉన్న నేతలు కేంద్ర కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
అంబేద్కర్ విగ్రహాల వద్ద...
అయ్యన్న పాత్రుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఆయనను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. అయ్యన్న అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందచేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
డీజీపీ కార్యాలయం వద్ద...
అయ్యన్న పాత్రడు అరెస్ట్ తో డీజీపీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీసుకు వెళ్లు మార్గమధ్యంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. పెద్దయెత్తున టీడీపీ కార్యకర్తలతో కలసి చంద్రబాబు డీజీపీ ఆఫీసుకు వస్తారని తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
Next Story