Thu Dec 26 2024 00:55:16 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కొత్త చీఫ్ సెక్రటరీ ఆయనేనా? చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉంది ఆయనేనట
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులవుతారన్న దానిపై చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. డిసెంబరు 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆరు నెలలపాటు పదవీ కాలాన్ని నీరబ్ ప్రసాద్ కు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో మరోసారి ఆ అవకాశం లేదు. చంద్రబాబు కూడా పొడిగించే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో కొత్త సీఎస్ గా ఎవరిని నియమించుతారన్న ఆసక్తి అధికారవర్గాల్లో వ్యక్తమవుతుంది. చీఫ్ సెక్రటరీ పదవి కోసం ఎనిమిది మంది పోటీ పడుతున్నా అందులో ఒక్కరికే అవకాశముంటుంది.
ఎనిమిది మందిలో...
అయితే ఆ ఎనిమిది మందిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు శ్రీ లక్ష్మి, అనంతరాము, సాయిప్రసాద్, అజయ్ జైన్, సుమితా దావ్రా, ఆర్పీ సిసోడియా, విజయానంద్, రాజశేఖర్ లు ఉన్నారు. ఇందులో శ్రీలక్ష్మికి ఆ పదవి దక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే జగన్ కేసుల్లో ఆమె గతంలో భాగస్వామ్యంగా ఉండటం, కేసులు నమోదు కావడం, జైలుకు వెళ్లి రావడం వంటికి శ్రీలక్ష్మికి ఆ పదవి దక్కదన్నది అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు మైండ్ కు అనుగుణంగా పనిచేసే వారు కావాలి. అలాగే ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించడంతో పాటు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను అమలు చేసే బాధ్యతను కూడా చీఫ్ సెక్రటరీ తీసుకోవాల్సి ఉంటుంది.
విజయానంద్ కేనా?
మరొక అధికారి అజయ్ జైన్ పై కూడా వైసీపీ అనుకూల ముద్ర ఉంది. దీంతో చీఫ్ సెక్రటరీగా అజయ్ జైన్ ను తీసుకునే అవకాశం లేదు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి అవకాశం ఉంటుంది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న సుమితా దావ్రా పేరును కూడా పరిశీలించే అవకాశం లేదు. అందరికంటే శ్రీలక్ష్మి సీనియర్. ఆమె 1988 బ్యాచ్ కు చెందిన అధికారి. అయితే తర్వాత 1990వ బ్యాచ్ కు చెందిన అనంతరాము పేరు కూడా పరిశీలనలో ఉంది.సాయిప్రసాద్, ఆర్పీసిసోడియాలు 1991 బ్యాచ్ చెందిన అధఇకారి, 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విజయానంద్ పేరును చంద్రబాబు పరిశీలించవచ్చు. ఆయన వచ్చే ఏడాది పదవీ విరమణ చేస్తుండటం, చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉండటం ఆయనకు కలసి వస్తుందని చెబుతున్నారు. విజయానంద్ విద్యుత్తు శాఖలో చంద్రబాబుకు చేదోడు వాదోడుగా ఉండటం కూడా అనుకూలించే అంశం.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story