Mon Dec 23 2024 13:04:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబు కీలక భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వరద బాధితులకు సహాయ కార్యక్రమాలు, వన్ టైమ్ సెటిల్ మెంట్, మూడు రాజధానుల అంశాలపై సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.
ఆందోళన కార్యక్రమాలు....
దీంతో పాటు పార్టీ చేయాల్సిన ఆందోళన కార్యక్రమాలను కూడా ఈరోజు ఖరారు చేయనున్నారు. ఇకపై వారానికి ఒక అంశంపై ప్రజల ముందుకు వెళ్లాలని, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టేలా నేడు సమావేశంలో చంద్రబాబు వ్యూహరచన చేయనున్నారు. అలాగే వల్లభనేని వంశీ క్షమాపణలపై కూడా చర్చించే అవకాశముంది.
- Tags
- chandra babu
- tdp
Next Story