Thu Dec 19 2024 03:20:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కుప్పంలో మూడో రోజు చంద్రబాబు
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నేడు మూడో రోజు పర్యటిస్తున్నారు. ఉద్రిక్తతల మధ్య ఆయన పర్యటన కొనసాగుతుంది
కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నేడు మూడో రోజు పర్యటిస్తున్నారు. ఉద్రిక్తతల మధ్య ఆయన పర్యటన కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు మోడల్ కాలనీలో చంద్రబాబు రోడ్ షో ఉంటుంది. ఈ రోడ్ షోకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ వర్గాలు ఒక చోట గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు....
నిన్న చంద్రబాబు పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. పరస్పరం రాళ్ల దాడికి దిగడం, చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు ఈరోజు అప్రమత్తమయ్యారు. నిన్న, మొన్న సంఘటనలకు సంబంధించి కుప్పం, రామకుప్పం పోలీస్ స్టేషన్ లలో వైసీపీ, టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. రెండు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈరోజు ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
Next Story