Mon Dec 23 2024 04:01:58 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్లంతా టీడీపీ స్టార్ క్యాంపెయినర్లే: చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైసీపీ మీద మరోసారి విరుచుకుపడ్డారు. ఆదివారం నెల్లూరులో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారన్నారు. వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రతీ ఒక్కరూ, వైసీపీ నేతల బాధితులు అందరూ టీడీపీ స్టార్ క్యాంపెయినర్లేనని చంద్రబాబు చెప్పారు. టీడీపీ తరఫున ఐదు కోట్ల మంది ఆంధ్రులను స్టార్ క్యాంపెయినర్లుగా మార్చి, వైసీపీని భూస్థాపితం చేయాలని అన్నారు. ఐదు కోట్ల మంది కలిసి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసి మన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
గల్లా జయదేవ్ కంపెనీని రాష్ట్రం వదిలిపోయేలా చేశారని వైసీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు చంద్రబాబు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాధితులుగా మారిపోయారని.. గల్లా జయదేవ్ వంటి వ్యక్తి కూడా బాధితుడయ్యాడని అన్నారు. గల్లా జయదేవ్ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేలా చేశారని.. అమరరాజా పరిశ్రమపై దాడులు చేసి వేరే రాష్ట్రానికి పారిపోయేలా చేశారన్నారు. ఒక రాజకీయ కుటుంబం రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని చంద్రబాబు విమర్శించారు.
Next Story