Thu Nov 14 2024 16:45:04 GMT+0000 (Coordinated Universal Time)
మొదటిరోజు ముగిసిన చంద్రబాబు విచారణ
రాజమహేంద్రవరం జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఐడీ
రాజమహేంద్రవరం జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 9.30 గంటలకు విచారణ మొదలైంది. సుమారు 6 గంటల పాటు చంద్రబాబును ప్రశ్నించారు సీఐడీ అధికారులు. కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయంపై ప్రశ్నలు వేశారు అధికారులు.
సీఐడీ DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ సాగింది. చంద్రబాబు స్టేట్మెంట్ను రికార్డు చేశారు అధికారులు. చంద్రబాబు నాయుడు తరపు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు పాల్గొన్నారు. భోజనంతో పాటు మొత్తం 4 సార్లు అధికారులు బ్రేక్ ఇచ్చారు. ప్రశ్నించే సమయంలో కేసుకు సంబంధించి ఆధారాలను టీడీపీ అధినేత ఎదుట పెట్టినట్లుగా తెలుస్తోంది. విచారణ సమయంలో ఇద్దరు మీడియేటర్లు, ఒక వీడియో గ్రాఫర్ ఉన్నారు. కోర్టు సాయంత్రం ఐదు గంటల వరకే విచారణ చేయాలని ఆదేశించింది. బాబు ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందం ఉంది. ఆదివారం కూడా చంద్రబాబు కస్టడీ విచారణ సాగనుంది.
Next Story