Wed Nov 27 2024 09:39:50 GMT+0000 (Coordinated Universal Time)
మందు బాబులకు భారీ హామీ ఇచ్చిన చంద్రబాబు
నంద్యాల జిల్లా నందికొట్కూరు బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..
నంద్యాల జిల్లా నందికొట్కూరు బహిరంగసభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ధరకు మద్యం అమ్ముతూ ఉండగా.. తాము అధికారం లోకి రాగానే మద్యం ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసిరకం మద్యాన్ని విక్రయిస్తున్నారని.. బూమ్ బూమ్, స్పెషల్ స్టేటస్, బ్రిటీష్ ఎంపైర్, బ్లాక్ బస్టర్ వంటి విచిత్రమైన బ్రాండ్లను అమ్ముతున్నారని విమర్శించారు. ఈ నాసి రకం మద్యాన్ని తాగి ఎంతో మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని.. మరో 6 నెలలు ఆగితే మీ బతుకులను బాగు చేస్తానని హామీ ఇచ్చారు.
తాము అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. రోడ్డుకు మట్టి వేయలేరు కానీ 3 రాజధానులు కడతారట అంటూ విమర్శలు గుప్పించారు. ఒక రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులని అంటున్నారు. మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని దుస్థితిలో మనం ఉన్నామని ఆయన అన్నారు. సింహంలా బతుకుతా.. శాశ్వతంగా సింహంలా ఉంటానని.. రోజుకు 18 గంటలు పని చేస్తానని, ముందు ఇరవై ఏళ్లకు కావాల్సిన వాటిపై ఆలోచిస్తానని అన్నారు. సీఎం జగన్ రోజుకు ఒక గంటైనా పని చేస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. 2019లో జగన్ రాక పోయింటే ఏపీ, తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందేదన్నారు. నందికొట్కూరులో మాదిగలకు, బుడగ జంగాలకు న్యాయం చేస్తానని చెప్పారు.
Next Story