Amaravathi : అమరావతి రైతులకు ఇక డబ్బులే డబ్బులు.. కోట్ల రూపాయలు కళ్ల చూస్తారుగా
అమరావతి రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Nowఅమరావతి రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని పనులను వేగంగా చేయడంలో భాగంగా రైతులకు కేటాయించిన రిటర్న్ బుల్ ప్లాట్లలో సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. తొలి విడత పనుల్లో భాగంగానే ఈ ప్లాట్లకు అన్ని రకాల వసతులను సమకూర్చాలని నిర్ణయించింది. రైతులు వేగంగా ఇళ్లు నిర్మించుకోవాలన్నా, లేకుంటే ఇతర కమర్షియల్ కాంప్లెక్స్ లను నిర్మించుకోవడానికి అనువుగా అన్ని సదుపాయాలను కల్పించేందుకు సిద్ధమయింది. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు రహదారులు, మంచినీరు, మురుగునీటి కాల్వ వ్యవస్థ, విద్యుత్తు, గ్రీనరీ, కాల్వలతో పాటు రిజర్వాయర్లు కూడా నిర్మాణం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ