Tue Dec 24 2024 00:54:56 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ రాయలసీమ ద్రోహి ఆళ్లగడ్డ సభలో చంద్రబాబు
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలంటే మళ్లీ టీడీపీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు.
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. ఆళ్లగడ్డలో జరిగిన రా కదలిరా సభలో ఆయన ప్రసంగించారు. వైసీపీవి సామాజిక యాత్రలు కాదని మోసపూరిత యాత్రలని ంచంద్రబాబు అన్నారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే కర్నూలు పరిశ్రమలకు హబ్ గా మారి ఉండేదని అన్నారు. జగన్ రాయలసీమ ద్రోహి అని చంద్రబాబు అన్నారు. రాజధాని పేరు చెప్పి ప్రజలను మోసం చేశాడన్నారు.
మరోసారి మోసపోవద్దు...
జగన్ మాటలు విని మోసపోవద్దని ప్రజలను చంద్రబాబు హెచ్చరించారు. రాయలసీమకు గోదావరి నీళ్లు తరలించాలని తాను భావిస్తే జగన్ దానిని నాశనం చేశాడన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి రాయలసీమను సస్య శ్యామలం చేస్తానని చెప్పుకొచ్చారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు అయినా వచ్చిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పైసా కూడా ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయలేదన్న చంద్రబాబు అంగళ్లలో తనపై తప్పుడు కేసులు పెట్టి పైశాచికానందం పొందారన్నారు.
Next Story