Thu Dec 26 2024 12:17:36 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu Cabinet : జగన్ తరహాలోనే చంద్రబాబు చేయనున్నారా? రెండున్నరేళ్ల తర్వాత మారుస్తారా?
చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో 24 మందికి అవకాశం కల్పించారు.
చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో 24 మందికి అవకాశం కల్పించారు. అయితే జగన్ తరహాలోనే రెండున్నరేళ్లకు మంత్రివర్గాన్ని మార్చే అవకాశాలున్నాయి. సీనియర్లు ఎవరికీ కేబినెట్ లో స్థానం దక్కలేదు. దీంతో ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు కేవలం రెండున్నరేళ్లకే పరిమితమవుతారన్న ప్రచారం జరుగుతుంది. తర్వాత విస్తరణలో సీనియర్ నేతలకు అవకాశం కల్పించాలని నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రాంతాల వారీగా అందరికీ సముచిత స్థానం కల్పించాల్సి రావడంతో ఆయన ఈనిర్ణయం తీసుకున్నారని తెలిసింద.ి
తొలి సారి ఎమ్మెల్యేలు...
మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలు గా గెలిచిన 10మందికి చోటు దక్కింది.నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా మరో ఎనిమిది మంది తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలున్నారు.తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మండిపల్లిరామ్ ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్.సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి లు తొలి సారి గెలిచిన ఎమ్మెల్యేలు.వీరికి సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు.
పాత, కొత్త వారితో...
పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, బీసీ జనార్థన్ రెడ్డిలు పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, కొలుసు పార్థసారధి లు గతంలో మంత్రులుగా చేసిన వారు. పాత కొత్త వారితో మంత్రులుగా అవకాశం కల్పించారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వంటి వారికి అవకాశం దక్కలేదు.
ఇతర పార్టీల నుంచి..
ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. చివరి నిమిషంలో వచ్చిన కొలుసు పార్థసారధి మంత్రివర్గంలో స్థానం దక్కించుకోగా, వైసీపీ నంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించారు. జిల్లాల్లో సీనియర్ నేతలు ఎంపికయినా వారికి అవకాశం కల్పించలేదు. కొత్త వారికే ఛాన్స్ ఇచ్చి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, గద్దె రామ్మోహన్ రావు వంటి వారికి కూడా అవకాశం కల్పించలేకపోయారు. జగన్ తరహాలో రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మారుస్తారన్న ప్రచారం మాత్రం ఉంది.
Next Story