Sat Dec 21 2024 05:09:43 GMT+0000 (Coordinated Universal Time)
కత్తితో పోరాటమే సరైనది అంటూ ట్వీట్ చేసిన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా
చంద్రబాబు కేసులు వాదిస్తున్న సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్
చంద్రబాబు కేసులు వాదిస్తున్న సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. "అన్ని విధాలా ప్రయత్నించినా.. న్యాయం కనుచూపు మేరలో కన్పించనప్పుడు.. కత్తితో పోరాటమే సరైనది" అంటూ ట్వీట్ చేశారు. గురుగోబింద్ సింగ్ మాటలు ప్రస్తావించిన సిద్ధార్థ్ లూథ్రా.. మోటో ఫర్ ద డే అంటూ ట్వీట్ చేశారు. పంజాబీల గురువు గురు గోబింద్ సింగ్ అప్పటి మొఘుల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ను ఉద్దేశించి రాసిన జఫర్‌నామాలో ఈ మాటలున్నాయి. దీనికి సంబంధించి ఉర్దూలో గురుగోబింద్ సింగ్ మాటల ఫొటోను ట్యాగ్ చేశారు.
స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ చర్చకు దారిసింది.. ”అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది” అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్లో షేర్ చేశారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఉన్నత న్యాయస్థానం వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ఇరువైపుల వాదనలు వినాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు రిమాండ్ రాజ్యాంగ విరుద్ధమని, చంద్రబాబు అరెస్టుకు ముందు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.
Next Story