Thu Nov 14 2024 22:04:56 GMT+0000 (Coordinated Universal Time)
రేపటికి వాయిదా.. ఎందుకంటే?
టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను విజయవాడలోని
టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్ లపై మంగళవారం విచారిస్తామని తెలిపింది. కస్టడీ పిటిషన్ పై సీఐడీ మెమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని చెప్పింది. మంగళవారం కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత రెండింటిపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై దేన్ని ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని తెలిపింది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేచారు. శనివారం నాడు సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో స్పెషల్ లీవ్ పిటిషన్ ను న్యాయవాది గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. పిటిషన్ ను ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. చంద్రబాబు పిటిషన్ ను అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఆయన తరపు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. ఈ క్రమంలో పిటిషన్ ను రేపు ప్రస్తావించడానికి ధర్మాసనం అనుమతించింది. విచారణ తేదీని రేపు ఖరారు చేసే అవకాశం ఉంది.
Next Story