Tue Nov 26 2024 21:34:08 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీం కోర్టులో చంద్రబాబుకు షాక్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు బ్రేక్ పడింది. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సర్వోన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు ద్విసభ్య బెంచ్ విచారణకు విముఖత చూపింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విచారణకు మొగ్గు చూపలేదు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్ విచారణ మరో బెంచ్‌కు బదిలీ అయ్యే అవకాశముంది. విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి విముఖత చూపించడంతో.. సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. అర్జంట్‌గా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది.
రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు చంద్రబాబు పిటిషన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
Next Story