Fri Nov 22 2024 14:05:27 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన చంద్రబాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టిసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో చంద్రబాబు సవాల్ చేశారు. చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని పిటిషన్ లో ఆయన న్యాయవాదులు తెలిపారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ ఉదయం ఆయనను కస్టడీలోకి తీసుకున్న సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తున్నారు. ఉదయమే చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం మెడికల్ టెస్టులు చేసింది. అల్పాహారాన్ని తీసుకున్న చంద్రబాబు మెడిసిన్స్ వేసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు సరిగ్గా ఉదయం 9.30 గంటలకు ఆయనను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని, విచారణను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ బ్రేక్ ఇస్తారు. 2 గంటల వరకు భోజన విరామం ఉంటుంది. ప్రతి గంటకూ చంద్రబాబుకు 5 నిమిషాల పాటు బ్రేక్ ఇస్తారు. సీఐడీ విచారణ నేపథ్యంలో జైలు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
News Summary - chandrababu naidu reached supreme court on high court decision
Next Story