Mon Dec 23 2024 10:14:14 GMT+0000 (Coordinated Universal Time)
కార్యకర్తలు సంయమనం పాటించాలి: చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంయమనం
చంద్రబాబు నాయుడు సంయమనం పాటించాలని కోరారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్య చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటే.. నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నారని చంద్రబాబు నాయుడు మీడియాతో చెప్పారు. చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు చంద్రబాబు నాయుడు తెలిపారు. తప్పు చేస్తే నిరూపించాలని.. చివరకు ధర్మమే గెలుస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అధిక సంఖ్యలో పోలీసులు చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి చేరుకున్నారు. దీనికోసం అనంతపురం నుంచి నంద్యాలకు పోలీసు బృందాలను రప్పించారు. అలా మొత్తం ఆరు బస్సుల్లో ఎస్పీ కార్యాలయం వద్దకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. శనివారం ఉదయం ఐదు గంటల తర్వాత చంద్రబాబు నాయుడు వాహనం చుట్టూ ఉన్న టీడీపీ నేతలను అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిలో కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల, ప్రియ జగద్విఖ్యాతిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి తదితర స్థానిక టీడీపీ నేతలు ఉన్నారు.
Next Story