Sat Nov 09 2024 01:37:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నేతలకు చంద్రబాబు నాయుడు వార్నింగ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. గెలిచే అవకాశం ఉన్న వారికే టికెట్లు ఇస్తామని.. నాయకుల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదన్నారు. పనితీరు బాగాలేకుంటే ప్రత్యామ్నాయం చూపించి పక్కన పెడతామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఓట్ల అవకతవకల విషయాన్ని ఇంఛార్జ్లు బాధ్యతగా తీసుకోవాలన్నారు. అన్నీ పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందనే అలసత్వం వద్దని అన్నారు. ప్రతి కార్యక్రమంలో తెలుగుదేశం-జనసేన నేతలు కలిసి వేదికను పంచుకోవాలని చంద్రబాబు సూచించారు. క్షేత్రస్థాయిలోనూ కలిసి పనిచేస్తూ జగన్ను ఇంటికి సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన నేతలతో కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు.
మిగ్జామ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించారు. బాపట్ల జమ్ములపాలెంలోని ఎస్టీ కాలనీలో ప్రజల పరిస్థితిని చూసి విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా లేక నాలుగు రోజులు చీకట్లోనే గడిపామని బాధితులు తెలిపారు. సమస్యలను ఎంతో ఓపిగ్గా విన్న చంద్రబాబు... తాము అధికారంలోకి వచ్చాక అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ కాలనీ వాసులకు చంద్రబాబు నిత్యావసరాలతో కూడిన కిట్లు పంపిణీ చేశారు.టీడీపీ తరఫున ఒక్కో ఇంటికి రూ.5 వేలు అందిస్తున్నామని.. ప్రభుత్వం రూ.25 వేలు ఆర్థికసాయం బాధితులకు అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story