Sat Nov 23 2024 02:36:41 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు కేంద్రంలో కీలకంగా మారనున్నారా? అది జరిగితే మరింత కీరోల్
కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారనున్నారు. ఆయన త్వరలోనే కీ రోల్ పోషిస్తారని తెలిసింది.
కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలకంగా మారనున్నారు. ఆయన త్వరలోనే కీ రోల్ పోషిస్తారని తెలిసింది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలయితే చంద్రబాబు డిమాండ్ మరింత పెరగనుంది. హర్యానాలో తిరిగి బీజేపీ పుంజుకుంది. జమ్మూ కాశ్మీర్ లో మాత్రం ఇండియా కూటమి ముందంజలో ఉంది. ఎలా జరిగినా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు చెప్పినట్లు తలాడించాల్సిందే. ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపు అవే చెప్పాయి. కాంగ్రెస్ కూటములు రెండు రాష్ట్రాల్లో విజయం సాధిస్తుందని చెప్పాయి. దీంతో చంద్రబాబు ఇక అడిగింది అడిగినట్లు జరుగుతుంది. మోదీ కూడా తన పాత వైఖరిని పక్కన పెట్టి చంద్రబాబును మంచి చేసుకోవడానికే ప్రయత్నించాలి. ఒకరకంగా ఆంధ్రప్రదేశ్ కు ఇది శుభపరిణామమేనని అంటున్నారు.
ఎన్నడూ లేని పరిస్థితులు...
గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు కేంద్రంలో తలెత్తాయి. మోదీ ప్రభుత్వం పూర్తిగా చంద్రబాబు మద్దతు పై ఆధారపడింది. అలాగని చంద్రబాబు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా ఆయన అనేక మార్లు ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలో పెద్దలు కలిశారు. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం నిధుల కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రం సహకరిస్తే ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయడం సులువుగా మారుతుంది. చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్ కు రెండో సారి సరైన సమయంలో ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కింది. మోదీని యాచించే పరిస్థితి నుంచి శాసించే స్థాయికి రావడం రాష్ట్రానికి మంచిదే.
ఆ రెండు ప్రాజెక్టులే అయితే...?
ఇప్పుడు చంద్రబాబు ముందున్న లక్ష్యం కేవలం ఆ రెండు ప్రాజెక్టులు మాత్రమే కాదు. కేవలం అమరావతి, పోలవరం ప్రాజెక్టు అని కూర్చుంటే భవిష్యత్ లో రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. ఆయన మిగిలిన సమస్యలపైన కూడా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు తేవాల్సి ఉంటుంది. అలా కాకుండా అమరావతి, పోలవరంపైనే ఫోకస్ పెడితే మాత్రం అభాసుపాలు కాక తప్పదు. మోదీ ప్రభుత్వం కూడా ఆ రెండింటికీ సాయం చేసి మిగిలిన వాటి విషయంలో చేతులెత్తేస్తే అప్పుడు జనాలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతుంది.
అనుభవం ఉన్న నేతగా...
అయితే చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న నేత. ఆయనకు వేరు ఇంకొకరు చెప్పాల్సిన పనిలేదు. చరిత్రలో చిరస్థాయిగా తన పేరును నిలిచిపోవడానికి పోలవరం, అమరావతి నిర్మాణాలను పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. అదే సమయంలో అన్ని ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా, మరిన్ని నిధులు తేవాలన్న ప్రయత్నంలోనే ఢిల్లీలో మకాం వేసి ఉన్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో హామీని నెరవేర్చి ఆయన తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నారు. చంద్రబాబు కు అలా కలసి రావడంతో ఢిల్లీలో ఆయన చెప్పినట్లే జరిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారన్నది అంతే నిజం.
Next Story