Sun Dec 22 2024 20:07:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : శాసనసభ సాక్షిగా మహిళలకు హామీ ఇచ్చిన చంద్రబాబు
రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులని చంద్రబాబు శాసనసభలో తెలిపారు
ఆ రెండు ఉంటేనే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఖచ్చితంగా ఈ పథకానికి అర్హులని ఆయన శాసనసభలో తెలిపారు. ఎంతమంది ఉన్నప్పటికీ అందరికీ ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందచేస్తామని తెలిపారు.
రెండు ఉంటే...
అంతేతప్ప ఇతర నిబంధనలు పెట్టి ఈ పథకాన్ని వర్తింప చేయకుండా ఉండమని, అధికారులకు తాను స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. ఎవరైనా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండి దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ అందకపోతే ఫిర్యాదు చేయవచ్చని చంద్రబాబు తెలిపారు.
Next Story