Mon Dec 23 2024 07:09:18 GMT+0000 (Coordinated Universal Time)
ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు?
ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బతగిలింది. లీగల్ ములాఖత్‌ల సంఖ్య పెంచాలంటూ దాఖలైన పిటీషన్ న్యాయస్థానం కొట్టేసింది
ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బతగిలింది. లీగల్ ములాఖత్‌ల సంఖ్య పెంచాలంటూ దాఖలైన పిటీషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నందున, అనేక కేసులు వివిధ న్యాయస్థానాల్లో విచారణ దశలో ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య మూడు కు పెంచాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. అత్యవసరంగా ఈ పిటీషన్ ను విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు.
ప్రతివాదులను చేర్చకుండా...
అయితే ప్రతివాదులను చేర్చకుండా పిటీషన్ దాఖలు చేయడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా పిటిషన్ పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ నవంబరు 9వ తేదీకి వాయిదా పడగా, ములాఖత్ ల పిటీషన్ కొట్టివేయడంతో టీడీపీ వర్గాలు డీలా పడ్డాయి.
Next Story