Sun Dec 22 2024 22:05:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబుతో ములాఖత్
ఈరోజు చంద్రబాబును వారి కుటుంబ సభ్యులు కలవనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకకు ములాఖత్ కానున్నారు
ఈరోజు చంద్రబాబును వారి కుటుంబ సభ్యులు కలవనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకకు ములాఖత్ కానున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలతో కలసి అచ్చెన్నాయుడు కూడా ఈరోజు చంద్రబాబును కలవనున్నారు. చంద్రబాబుకు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో వచ్చే నెల ఐదో తేదీ వరకూ న్యాయస్థానం రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
సెంట్రల్ జైలులో...
అయితే ఇప్పటి వరకూ ఆయనకు బెయిల్ రాలేదు. హైకోర్టులోనూ క్వాష్ పిటీషన్ను కొట్టేశారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ విచారణకు రానుంది. నారా లోకేష్ ఢిల్లీలోనే ఉండి చంద్రబాబు కేసుకు సంబంధించి న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. ఈరోజు ములాఖత్ అయి పార్టీ భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించే అవకాశముంది.
Next Story