Sun Dec 14 2025 18:04:03 GMT+0000 (Coordinated Universal Time)
తొలిసారి కుప్పంలో భువనేశ్వరి నామినేషన్ దాఖలు
రేపు మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నామినేషన్ పత్రాతలను దాఖలు చేయనున్నారు

రేపు మధ్యాహ్నం కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నామినేషన్ పత్రాతలను దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరుపున ఆయన సతీమణి భువనేశ్వరి నామనేషన్ పత్రాలను అధికారులకు సమర్పించనున్నారు. రేపు మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలిసారిగా చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చంద్రబాబు తరుపున...
చంద్రబాబు తరఫున రెండు సెట్లు నామినేషన్ దాఖలు భువనేశ్వరి చేయనున్నారు. రేపు ఉదయం కుప్పం వరదరాజులస్వామి ఆలయంలో భువనేశ్వరి పూజలు నిర్వహించునున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం కుప్పంలో చంద్రబాబు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన నున్నారు. ఎల్లుండి కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు. జరగున్నాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా భువనేశ్వరి కుప్పం వెళ్లనున్నారు.
Next Story

