Mon Dec 23 2024 12:54:36 GMT+0000 (Coordinated Universal Time)
సీనియర్ నేతలతో చంద్రబాబు ...?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం కానున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో నేడు చంద్రబాబు సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఆయన నేతలతో చర్చించనున్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి పార్టీ మహిళల ఆత్మగౌరవ సభలను జరపాలని నిర్ణయించింది. దీనిపై కూడా చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇసుక కొరత, వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ వైఫల్యం వంటి అంశాలపై కార్యాచరణను ప్రకటిస్తారని తెలిసింది.
పార్లమెంటు సమావేశాల్లో....
అలాగే ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలను ఎప్పటికప్పుడు సీనియర్ నేతలతో చర్చించి పార్లమెంటు సభ్యులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అధికార వైసీపీ ఎత్తుగడలకు తగినట్లుగా ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకునే విధంగా నిర్ణయాలు ఉండేలా చంద్రబాబు ఈ సమావేశంలో నేతలతో సమాలోచనలు జరుపుతారు.
- Tags
- chandra babu
- tdp
Next Story