Mon Dec 15 2025 04:07:56 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేటి నుంచి చంద్రబాబు టూర్
నేటి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు

నేటి నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు, రేపు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ఈ పర్యటనలు చేపట్టనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో చంద్రబాబు జనంలోకి వెళ్లనున్నారు. 31వ తేదీ వరకూ ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారయింది. రోజుకు మూడు నుంచి నాలుగు సభల్లో ప్రసంగించేలా రోడ్ మ్యాప్ ను పార్టీ రూపొందించింది.
నేడు కుప్పంలో...
25, 26 తేదీల్లో కుప్పంలోనూ, 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో, 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి సభల్లో పాల్గొననున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నేతలు చూస్తున్నారు.
Next Story

