Tue Dec 24 2024 13:07:51 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అశోక్ బాబు ఇంటికి చంద్రబాబు
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత అశోక్ బాబును నేడు చంద్రబాబు పరామర్శించనున్నారు.
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన టీడీపీ నేత అశోక్ బాబును నేడు చంద్రబాబు పరామర్శించనున్నారు. పటమటలంకలోని ఆయన ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శిస్తారు. గురువారం అర్ధరాత్రి ఏపీ సీఐడీ పోలీసులు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తన ఉద్యోగంలో ఉన్నప్పుడు తప్పుడు విద్యార్హతలతో పదోన్నతి పొందారని అశోక్ బాబుపై ఆరోపణలున్నాయి. లోకాయుక్త ఆదేశంతో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.
బెయిల్ రావడంతో...
అయితే అశోక్ బాబుకు నిన్న అర్థరాత్రి బెయిల్ లభించింది. ఇద్దరు వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ లభించడంతో విడుదలయ్యారు. ఆయనను పరామర్శించేందుకు చంద్రబాబు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లనున్నారు. వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పరామర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు ఇంటికి వెళ్లి కూడా చంద్రబాబు పరామర్శించి వచ్చారు.
Next Story