Mon Dec 23 2024 16:56:29 GMT+0000 (Coordinated Universal Time)
ఇటు కస్టడీ .. అటు బెయిల్ పిటీషన్
చంద్రబాబు రిమాండ్ వ్యవహారంపై ఈరోజు కూడా ఏసీబీ కోర్టులో కస్టడీ పిటీషన్ పై విచారణ జరగనుంది
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో నేడు మూడు పిటీషన్లు విచారణకు రానున్నాయి. చంద్రబాబు రిమాండ్ వ్యవహారంపై ఈరోజు కూడా ఏసీబీ కోర్టులో కస్టడీ పిటీషన్ పై విచారణ జరగనుంది. ఇప్పటికే సీఐడీ అధికారులు కస్టడీ పిటీషన్ ను దాఖలు చేశారు. చంద్రబాబును స్కిల్ డెవలెప్మెంట్ కేసులో జరిగిన అవినీతిపై విచారించేందుకు చంద్రబాబును వారం రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు పిటీషన్ లో పేర్కొన్నారు.
లోతుగా విచారించాలంటూ...
ఈ స్కామ్ కు సంబంధించి అనేక విషయాలను విచారించాల్సి ఉందని, అందుకోసం తమకు కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు పిటీషన్ వేశారు. ఏ 37 నిందితుడు చంద్రబాబును మరింత లోతుగా విచారించాల్సి ఉందని పిటీషన్ లో సిఐడీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ తమ విచారణకు ఆయన సహకరించకపోవడంతో మరింతగా ఈ కేసులో విచారణ చేయాల్సి ఉందని తెలిపారు.
బెయిల్ కోసం...
మరోవైపు ఏసీబీ కోర్టుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా చేరుకున్నారు. సీబీఐ కస్టడీ పిటీషన్ పై కూడా తన వాదనలను ఆయన వినిపించనున్నారు. అయితే చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టులో వెయాలా? లేక హైకోర్టులో వేయాలా? అన్న దానిపై టీడీపీ లీగల్ టీం చర్చలు జరుపుతుంది. ఏసీబీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తొలుత హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేయాలని భావించినా తర్వాత చర్చల అనంతరం ఏసీబీ కోర్టులోనే బెయిల్ పిటీషన్ వేయాలని వారు నిర్ణయించినట్లు తెలిసింది. మధ్యాహ్న సమయానికి దీినపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story