Mon Dec 23 2024 18:03:17 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు బృందానికి తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందానికి తృటిలో ప్రమాదం తప్పింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు బృందానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన పర్యటిస్తున్న బోటు తిరగబడింది. అయితే చంద్రబాబు బోటు సురక్షితంగానే ఒడ్డుకు చేరింది. అయితే ఇతర నేతలు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా తోపులాట జరగడంతోనే ఈ పడవ బోల్తా పడినట్లు తెలిసింది. సోంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆచంట నుంచి బోటులో గంట ప్రయాణం చేసిన చంద్రబాబు బృందం సోంపల్లి వద్ద బోటు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
మాజీ మంత్రులు....
పదిహేను అడుగుల లోతు ఉన్న నీటిలో మాజీ మంత్రులు పితీని సత్యనారాయణ, దేవినేని ఉమ, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యేలను వెంటనే మత్స్యకారులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి రక్షించారు. టీడీపీ నేతలు రాధాకృష్ణ, అంగర రామోహన్ రావు, రామరాజు తదితరులు ఉన్నారు. బోటు సామర్థ్యానికి మించి ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. వరద ఉధృతి తగ్గడంతో నీటి లోతు తక్కువగా ఉండటంతో టీడీపీ నేతలు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Next Story