Mon Dec 23 2024 12:28:16 GMT+0000 (Coordinated Universal Time)
చెవిరెడ్డికి మళ్లీ అదే పదవి
తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి నియమితులయ్యారు
తిరుపతి అర్బన్ డెవెలెప్మెంట్ అధారిటీ ఛైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదవీ కాలం మరో రెండు నెలల్లో ముగియనుండగనే ముందుగానే ఈ ఉత్తర్వులు జారీ చేయడం పై చర్చ జరుగుతుంది.
మంత్రివర్గ విస్తరణలో....
రేపు జరగనున్న మంత్రి వర్గ విస్తరణలో చెబిరెడ్డి భాస్కర్ రెడ్డికి మంత్రి పదవి దక్కదని దీంతో తేలిపోయింది. ఆ జిల్లా నుంచి జగన్ మరొకరిని ఎంపిక చేసే అవకాశముంది. ఇంకా రెండు నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ చెవిరెడ్డికి పదవి పొడిగింపు, మంత్రివర్గానికి లింకు పెట్టడమే గమనార్హం. దీంతో మంత్రి వర్గం రేసు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించినట్లే నని చెప్పాలి.
Next Story