Mon Dec 23 2024 07:24:19 GMT+0000 (Coordinated Universal Time)
Mohith Reddy: మోహిత్ రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు.. బయటకొచ్చాక చేసిన సవాల్ ఇదే!!
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని తిరుపతి డీఎస్పీ రవిమనోహరాచారి నేతృత్వంలోని పోలీసులు బెంగళూరు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలోని ఎస్వీయూ పీఎస్‌కు తరలించి, కాసేపు విచారించిన అనంతరం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. మోహిత్ రెడ్డి విదేశాలకు వెళ్లకూడదని పోలీసులు కండీషన్ పెట్టారు.
కేసులతో బెదిరించాలని చూస్తే భయపడే వారు ఎవరూ లేరని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విమర్శించారు. పులివర్తి నానికి దమ్ము ధైర్యం, ఉంటే నేను దాడి చేయించానని ప్రమాణం చేయగలరా అని సవాలు విసిరారు. దాడి చేశారని చెప్పిన వారిని లొంగిపోమని చెప్పామని అన్నారు. అయితే తెలుగుదేశం నాయకులు మా నాయకుల మాపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఏమీ లేకుండానే మాపై తప్పుడు కేసులతో బెదిరిస్తున్నారని.. ఇప్పటి నుంచి అన్నిటికి సిద్ధమేనని అన్నారు. పులివర్తి నానికి ఏమి గాయాలు కానట్టు సిమ్స్ ఆస్పత్రి రిపోర్టు ఇచ్చాయి, అయినా కూడా దాడి జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారన్నారు. వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని.. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పే రోజు వస్తుందని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హెచ్చరించారు.
Next Story