Mon Dec 23 2024 11:10:25 GMT+0000 (Coordinated Universal Time)
కొండెక్కిన చికెన్ ధరలు.. కారణమేంటి ?
ఒక్కసారిగా పెరిగిన ధరలతో.. చికెన్ కొనాలంటే వినియోగదారులు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. చికెన్ ధరలు పెరిగినా..
విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే చికెన్ ధరలకు రెక్కలు రాగా.. తాజాగా ఏపీలోనూ చికెన్ ధరలు కొండెక్కాయి. నిజానికి వేసవికాలం వచ్చేసరికి చికెన్ ధరలు తగ్గుతాయి. ఎండలు పెరుగుతున్న సమయంలో బాయిలర్ కోళ్లు అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఆటోమెటిక్ గా వేసవిలో చికెన్ ధరలు తగ్గుతాయి. కానీ.. ఈ ఏడాది మాత్రం దానికి భిన్నందా చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. వారంరోజుల క్రితం వరకూ స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.180, స్కిన్ చికెన్ రూ.160 ఉండగా.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో స్కిన్ చికెన్ రూ.280, స్కిన్ లెస్ రూ.300కు పెరిగింది.
ఒక్కసారిగా పెరిగిన ధరలతో.. చికెన్ కొనాలంటే వినియోగదారులు ఆలోచించాల్సిన పరిస్థితి తలెత్తింది. చికెన్ ధరలు పెరిగినా.. కొనుగోళ్లు తగ్గడంతో తమ వ్యాపారం దెబ్బతింటోందని వ్యాపారస్తులు వాపోతున్నారు. కోడి మేత ధరలు విపరీతంగా పెరగడంతో బహుళజాతి సంస్థల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఫలితంగా చికెన్ ధరలు పెరిగాయంటున్నారు. బ్రాయిలర్ కోడి మేతలో ప్రధానమైన సోయాబీన్ ధర నెల రోజుల్లో కిలోకు ఏకంగా రూ. 35 నుంచి రూ.90కి పెరిగింది. మొక్కజొన్న కిలో రూ. 12 నుంచి రూ. 24కి పెరిగింది. ఈ పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ల పెంపకం సగానికిపైగా తగ్గిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కోడిమేత ధరలు పెరగడంతో.. పెంపకాలు తగ్గి.. డిమాండ్ కు తగిన సప్లై లేదంటున్నారు. మేత ధరలు తగ్గితే గానీ.. చికెన్ ధరలు తగ్గేలా లేవంటున్నారు పౌల్ట్రీ రైతులు.
Next Story