Thu Dec 19 2024 18:19:52 GMT+0000 (Coordinated Universal Time)
చికెన్ ప్రియులకు షాక్.. రూ.300 దాటిన కిలో చికెన్
ముక్క లేకపోతే ముద్దదిగని వాళ్లు.. చికెన్ కొనాలంటే జంకుతున్నారు. గడిచిన ఆరునెలల గరిష్ఠానికి చికెన్ రేట్లు పెరిగాయి.

విజయవాడ : చికెన్ ప్రియులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు.. చికెన్ ధరలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రెండు వారాల క్రితం కిలో చికెన్ రూ.300 ఉండగా.. ఇప్పుడు కిలో చికెన్ రూ.306కు చేరింది. ముక్క లేకపోతే ముద్దదిగని వాళ్లు.. చికెన్ కొనాలంటే జంకుతున్నారు. గడిచిన ఆరునెలల గరిష్ఠానికి చికెన్ రేట్లు పెరిగాయి. విజయవాడలో కిలో చికెన్ ధర రూ.306 ఉండగా.. హైదరాబాద్ లో రూ.281గా ఉంది.
ఫిబ్రవరి 7న కిలోరూ.185 ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.100 పెరగడంతో.. ఆదివారం పూట కూడా చికెన్ కొనాలంటే జేబులకు చిల్లు పడుతోంది. చికెన్ ధరలు పెరగడంతో.. కొనేవారు లేక వ్యాపారం లేదంటున్నారు వ్యాపారులు. కోడిమేత ధరలు పెరగడంతో.. చికెన్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. కాగా.. వంటనూనెలు, నిత్యావసరాల ధరలతో పాటు చికెన్ ధరలూ పెరగడంతో.. ఏదీ కొనలేని, తినలేని పరిస్థితి నెలకొందని సామాన్యులు వాపోతున్నారు.
Next Story