Mon Jan 13 2025 06:26:10 GMT+0000 (Coordinated Universal Time)
హైకోర్టు అదనపు భవనానికి సీజే శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా భూమి పూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు భవన సముదాయ నిర్మాణానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా భూమి పూజ చేశారు. ప్రస్తుతం అమరావతిలోని నేలపాడులో ఉన్న హైకోర్టు భవనానికి ఎదురుగా ఉన్న మూడు ఎకరాల్లో ఈ అదనపు భవనాలను నిర్మించనున్నారు. ఈ అదనపు భవనాల నిర్మాణం కోసం 33.50 కోట్ల రూపాయలను అంచనా వేశారు. జీ+3 భవన సముదాయాన్ని ఇక్కడ నిర్మించనున్నారు.
ఆరు నెలల్లో.....
ఈ భవన నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేయాలని కాల పరిమితిని నిర్దేశించారు. కొత్త భవనం నిర్మాణంతో హైకోర్టుకు అదనంగా 76,300 చదరపు అడుగుల వసతి సమకూరుతంది. ఈ భవనంలో లైబ్రరీతో పాటు రికార్డు రూము, కోర్టు హాళ్లు, న్యాయమూర్తుల సమావేశ మందిరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Next Story