Tue Nov 05 2024 19:37:29 GMT+0000 (Coordinated Universal Time)
TDP : తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో లావు పేరును ఆయన ఖరారు చేశారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు తొలిసారి 2014లో పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. వైసీపీ నుంచి నరసారావుపేట నుంచి గెలిచిన ఆయన 2024 ఎన్నికలకు ముందు తనకు గుంటూరు పార్లమెంటు సీటు కేటాయిస్తామని చెప్పడంతో నచ్చక పార్టీని వీడారు. ఆయనను తెలుగుదేశం పార్టీ చేర్చుకుని నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పై విజయం సాధించారు.
రాష్ట్ర ప్రయోజనాలే...
లావు శ్రీకృష్ణ దేవరాయలు పార్టీ పార్లమెంటరీ నేతగా నియమించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న వయసులోనే ముఖ్యమైన పదవి చేపట్టినట్లయింది. దీంతో పాటు సోమవారం నుంచి ప్రారంభమయ్యే లోక్సభ సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఎంపీలకు వివిధ శాఖలను అప్పగిస్తామని, ఆ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి నిధులు తెచ్చేలా చూడాలని చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచించారు. పదవులు ముఖ్యం కాదని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పెట్టుకుని ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు.
Next Story