Sun Mar 30 2025 13:21:21 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : మహిళలకు చంద్రబాబు ప్రత్యేక సందేశం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవం జరుపుకోవటం అనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యత అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తుందన్న చంద్రబాబు మహిళలకు, ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య ఉద్యోగాల్లో రాజకీయాలో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనని తెలిపారు.
వార్షిక బడ్జెట్ లో...
తాజాగా 2025,26 వార్షిక బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమం కోసం,, ఎన్నడూ లేని విధంగా రూ ,4,332 కోట్లు కేటాయించడం ద్వారా వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలియజేశామన్నారు. అలాగే దీపం పథకం 2 స్కీమ్ కింద 90,1 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, ఎన్టీఆర్ భరోసా పించన్లు అంగన్వాడీ సెంటర్లు బలోపేతం లాంటి చర్యలతో పేద మహిళల అభ్యున్నతికి చిత్తశుద్దితో పని చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
Next Story