Sun Dec 22 2024 16:27:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు
ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకారంతోనే ఏపీ గట్టెక్కే అవకాశాలున్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిందని, ఈ నెల 23న ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక సాయం అందించాలని చంద్రబాబు అమిత్ షాను అభ్యర్థించారు. విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించడంతో పాటుగా అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ఇతోధిక సాయం అందించాలని కోరారు.
కేంద్ర బడ్జెట్ లో...
ఇందుకోసం కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని కోరారు. విశాఖ రైల్వే జోన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా పూర్తి చేయాలని అమిత్ షాకు వివరించారు. ఇందుకోసం కొత్త జాతీయ రహదారులతో పాటు, రైలు మార్గాలను కూడా మంజూరు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దాదాపు గంట సేపు సాగిన ఈ సమావేశంలో అమిత్ షా ఎదుట పలు అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు
Next Story