Thu Apr 03 2025 00:05:13 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : కూటమిదే విజయం కావాలి.. నేతలకు దిశానిర్దేశం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి అందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నిచ్చారు. కేవలం పదిరోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉందని, అందరు నేతలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కూటమి ధర్మాన్ని నేతలు పాటించాలని చంద్రబాబు కోరారు. నియమావళిని ఉల్లంఘించకుండా పార్టీ అభ్యర్థుల కోసం పనిచేయాలని కోరారు.
అత్యంత భారీ మెజారిటీతో...
మామూలుగా గెలుపు ముఖ్యం కాదని, మెజారిటీ ఎంత అన్నదే తాను చూస్తానని చంద్రబాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువగా ఉండాలని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా కలసి కట్టుగా పనిచేయాలని కోరార. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
Next Story