Thu Nov 21 2024 13:26:59 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై చంద్రబాబు తొలిసారి ఏమన్నారంటే?
విద్యుత్తు ఛార్జీలప పెంపుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు
విద్యుత్తు ఛార్జీలప పెంపుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిసారి స్పందించారు. గత ప్రభుత్వం చేసిన పాపానికి సర్దుబాటు ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తుందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు ఛార్జీలను పెంచబోమని చంద్రబాబు తెలిపారు. 2022 -23లో సర్ ఛార్జీల పేరుతో రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలను నేడు అమలు చేయాల్సి వస్తుంది. డబ్బులు ప్రభుత్వం చెల్లించాలనుకుంటే ఎక్కడా వెసులు బాటు లేకుండా చేశారన్నారు. ఖజానాను ఖాళీ చేశారన్నారు. రాజధాని ప్రాంతం అమరావతిలో సబ్ స్టేషన్లను ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులకు...
అన్ని వ్యవస్థలను బాగు చేసుకుంటూ వస్తున్నామని, అందులో భాగంగానే ఇకపై విద్యుత్తు ఛార్జీలను పెంచబోమని తెలిపారు. గత ప్రభుత్వం విద్యుత్తు ఒప్పందాలను కూడా రద్దు చేసిందన్నారు. వాళ్లు చేసిన తప్పులకు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఇప్పుడు అనుభవించాల్సి వస్తుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు ఛార్జీలను పెంచబోమన్న హామీకి తాను కట్టుబడి ఉన్నానని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు.
Next Story