Thu Dec 19 2024 12:59:20 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : గుడివాడలో అన్నా క్యాంటిన్ ప్రారంభం
గుడివాడలో అన్నా క్యాంటిన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు
గుడివాడలో అన్నా క్యాంటిన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అన్నా క్యాంటిన్ ను చంద్రబాబు గుడివాడలో ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి స్వయంగా అక్కడ భోజనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్కడ పేదలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రేపటి నుంచి...
శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటిన్లు రేపటి నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే ఈ అన్నా క్యాంటిన్ ను ఏర్పాటు చేశామన్నారు. డొక్కా సీతమ్మ అన్నదానం చేసి ఎందరో ప్రజలను ఆదుకున్నారన్నారు. తొలి విడతగా వంద అన్నా క్యాంటిన్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందచేస్తున్నామని చెప్పారు. పదిహేను రూపాయలతో రోజుకు మూడు పూటల భోజనం పెట్టే ఉద్దేశ్యంతో వీటిని ఏర్పాటు చేశామన్నారు.
Next Story