Sun Jan 05 2025 21:53:07 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : విజన్ 2047 డాక్యుమెంట్ తో ఏపీని ముందుకు తీసుకెళతాం
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్నింటా అగ్రగామిలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ను అన్నింటా అగ్రగామిలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విజన్ 2047 విజన్ డాక్యుమెంట్ పై ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ భవిష్యత్ లో ఎవరు అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ విజన్ చెడిపోకుండా పకడ్బందీగా రూపొందిస్తున్నామని తెలిపారు. మూడు అంశాలలో ఏపీని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. వెల్త్ (సంపద), హెల్త్ (ఆరోగ్యం), హ్యాపీ (సంతోషం) ఈ మూడు ఏపీలో ప్రతి ఒక్కరికి ఉండేలా విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ఇబ్బందులున్నప్పటికీ వాటిని అధిగమించి అనుకున్న లక్ష్యానికి చేరతామని చంద్రబాబు నాయుడు తెలిపారు.
పేదరికం నిర్మూలనతోనే...
పీ -4 తోనే పేదరికం నిర్మూలన సాధ్యమవుతుందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో సంపద సృష్టించవచ్చని చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటిలోనూ ఒకరు పారిశ్రామికవేత్తగా ఉండాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని చంద్రబాబు తెలిపారు. అలాగే పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తయారు చేయాలన్న ఉద్దేశ్యంతోనే ఈ విజన్ డాక్యుమెంట్ ను రూపొందించామని తెలిపారు. రొటీన్ గా చే్స్తే ఎక్కడున్నామో అక్కడే ఉంటామని, అందుకే రొటీన్ కు భిన్నంగా విన్నూత్న ఆలోచనలతో ఏపీని ముందుకు తీసుకెళతామని అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. మహిళ సాధికారికత, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టిపెడతామని తెలిపారు.
Next Story