Mon Dec 23 2024 03:10:58 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రులకు క్లాస్ పీకిన చంద్రబాబు
మంత్రులు పనితీరుపై వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు అందచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
మంత్రులు పనితీరుపై వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్టు అందచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రి వర్గ సమావేశంలో అజెండాలో అంశాలను చర్చించిన తర్వాత అధికారులను పంపించి వేసి చంద్రబాబు మంత్రులతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై మాట్లాడారన్నారు. మంత్రులు తమ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలను గైడ్ చేయాలని అన్నారు.
ప్రోగ్రెస్ రిపోర్టు...
కొందరి ఎమ్మెల్యేలపై అప్పుడే ఇసుక ఆరోపణలు వస్తున్నాయని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాాలని అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తే సహించేది లేదని తెలిపారు. మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ ను వంద రోజుల తర్వాత అందిస్తామని, జనసేన మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును పవన్ కల్యాణ్ కు ఇస్తామని తెలిపారు.
Next Story